Central Government: కేంద్ర ప్రభుత్వ పథకం.. దీనిలో చేరితే భార్యాభర్తలు నెలకు రూ.18 వేలు పొందొచ్చు..
Central Government: కేంద్ర ప్రభుత్వ పథకం.. దీనిలో చేరితే భార్యాభర్తలు నెలకు రూ.18 వేలు పొందొచ్చు..
Central Government: సంపాదన ఎంత ఉన్నా నెలకు ఎంతో కొంత పొదుపు చేసుకోకపోతే.. వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చైపోతాయి. దీని కోసం కేంద్రప్రభుత్వం ఎన్నో పొదుపు పథకాలను ప్రవేశపెట్టింది. అయితే ఇక్కడ మరో అద్భుతమైన పొదుపు పథకం గురించి ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఏంటో తెలుసుకోండి.
సంపాదన ఎంత ఉన్నా నెలకు ఎంతో కొంత పొదుపు చేసుకోకపోతే.. వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చైపోతాయి. దీని కోసం కేంద్రప్రభుత్వం ఎన్నో పొదుపు పథకాలను ప్రవేశపెట్టింది. అయితే ఇక్కడ మరో అద్భుతమైన పొదుపు పథకం గురించి ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఏంటో తెలుసుకోండి.
2/ 9
60 ఏళ్లు పైబడిన వృద్ధులకు సామాజిక భద్రత కల్పించేందుకు భారత ప్రభుత్వం 2017లో 'ప్రధాన్ మంత్రి వయ వందన యోజన' (PMVVY)ని ప్రారంభించింది. భవిష్యత్తులో వడ్డీ ఆదాయం తగ్గడం వృద్ధులపై ప్రభావం చూపకుండా ఈ పథకం ద్వారా భద్రత కల్పిస్తుంది.
3/ 9
60 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు ఎలాంటి రిస్క్ ఉండదు. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోంది.
4/ 9
ప్రస్తుతం ఈ పథకం మార్చి 31, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ లో వృద్ధులకు వారి పెట్టుబడిని బట్టి పెన్షన్ మొత్తం ఇవ్వబడుతుంది. ఈ పథకం ద్వారా ఎవరైనా సీనియర్ సిటిజన్ రూ.9,250 వరకు పెన్షన్ పొందవచ్చు.
5/ 9
మీరు కూడా ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందాలనుకుంటే.. మీరు దరఖాస్తు చేసుకోవడానికి చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. మీరు ఇందులో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని మార్చి 31, 2023 వరకు మాత్రమే పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
దీని తర్వాత.. మీరు కోరుకున్నప్పటికీ మీరు ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందలేరు. చాలా బ్యాంకులు పదేళ్ల కాల పరిమితిలోని ఎఫ్డీలపై దాదాపు 6.5 శాతం వరకు వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి.
7/ 9
ప్రస్తుతం ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పథకంపై 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం పదేళ్లు. అంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల వరకు ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు.
8/ 9
ప్రధాన మంత్రి వయ వందన యోజన గురించి 2018లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం పెట్టుబడి పరిమితిని రూ.7.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
ప్రధాన్ మంత్రి వయ వందన యోజన కింద కనీసం రూ. 1000 నెలవారీ పెన్షన్ మరియు గరిష్టంగా రూ. 9250 నెలవారీ పెన్షన్ తీసుకోవచ్చు. మీరు పొందే పెన్షన్ మొత్తం మీ పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి రూ.15 లక్షల చొప్పున పెట్టుబడి పెడితే.. మీరు రూ.18,500 వరకు పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)