BMW XM SUV : ప్రపంచ కార్ల ఉత్పత్తిలో తిరుగులేని సంస్థగా ఉన్న బీఎండబ్ల్యూ.. 1978లో M1 బ్రాండ్‌ను లాంచ్ చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అదే M బ్రాండ్‌తో రెండోసారి స్టాండలోన్ ప్రొడక్ట్‌ని తెచ్చింది. M బ్రాండ్ నుంచి ఇది తొలి SUV. ఈ XM మోడల్.. ప్లగ్ ఇన్ హైబ్రీడ్ టెక్నాలజీతో వచ్చింది. ఈ కారు ఫార్చునర్ కంటే రెట్టింపు పవర్ఫుల్. ఇండియన్ మార్కెట్లో ఈ కారు ధర రూ.2.60 కోట్లు. (Image Credit : BMW)
సెప్టెంబర్‌లో ప్రకటన చేసి.. తాజాగా ఇండియాలో లాంచ్ చేసిన XMకి.. 4.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది ట్విన్-టర్బో చార్జ్ కలిగివుంది. ఇది 800 Nm పీక్ టార్క్ అవుట్‌పుట్ దగ్గర మాగ్జిమం 644 bHp పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కి 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఉంది. అలాగే ప్లగ్ ఇన్ హైబ్రీడ్ సిస్టం ఉంది. (Image Credit : BMW)
లుక్స్ పరంగా చూస్తే.. ఈ కారుకు BMW M కిడ్నీ గ్రిల్ ఉంది. ట్విన్ LED హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. పగటివేళ కూడా వెలిగే LED రన్నింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. భారీగా గాలిని లోపలికి తీసుకోగలదు. L షేపులో ఉన్న టైల్ ల్యాంప్ కూడా కాంతిని వెదజల్లేందుకు LEDs ఉన్నాయి. ఈ కారుకు 22 అంగుళాల అలాయ్ వీల్స్ ఉన్నాయి. (Image Credit : BMW)