BMW.. ఈ కారుకి సంబంధించి మూడు బాడీ డిజైన్లను ప్రదర్శించింది. ఈ కారు 240 రంగులు మార్చగలదు. ఈ రంగులు మార్చడం అనేది E Ink టెక్నాలజీతో సాధ్యమైంది. ఈ సాంకేతికత.. కారులోని అన్ని ప్యానెల్‌లలో ఉపయోగించారు. ప్రతి ప్యానెల్లో 32 రంగుల ఎంపికలు ఉన్నాయి. తద్వారా మీరు ఈ కారును ఒకే సమయంలో వేర్వేరు రంగులలోకి మార్చవచ్చు.
ఈ కారులో రంగు మారడమే కాకుండా అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ప్రొజెక్టింగ్ డ్రైవెన్ డేటా టెక్నాలజీని కూడా కలిగివుంటుంది. దాని సాయంతో, మీరు కారు విండ్‌షీల్డ్‌పైనే డిజిటల్ ఫార్మాట్లో డ్రైవింగ్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందగలుగుతారు. ఇది నావిగేషన్, స్పీడ్, మైలేజ్ వంటి సమాచారాన్ని విండ్షీల్డ్లోనే ప్రదర్శిస్తుంది. తద్వారా మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి సమస్యనూ ఎదుర్కోరు.
ఈ కారుతో అంతా బాగానే ఉన్నా.. పోలీసులకు సమస్య వస్తుంది. సాధారణంగా కార్లతో నేరాలు జరిగినప్పుడు.. కారు రంగును కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఒక్కోసారి కారు వెంట పోలీసుల ఛేజింగ్ ఉంటుంది. అప్పుడు ట్రాఫిక్‌లోనూ కారు రంగును బట్టీ.. అది ఎటు వెళ్తుందో గుర్తించగలరు. అదే రంగులు మారే కారు అయితే.. నేరస్థులు తప్పించుకునే ఛాన్స్ ఎక్కువ. అలాగని టెక్నాలజీని ఆపలేం. ఇలాంటి కార్లు వస్తే.. పోలీసులు కూడా తమ టెక్నాలజీని అందుకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)