BMW కంపెనీ కొత్త G 310 RR మోటార్‌సైకిల్‌ను రేపు భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కొత్త BMW G 310 RR అనేది TVS మోటార్స్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఈ ప్లాట్‌ఫారమ్‌ను రెండు కంపెనీలు తమ మోడల్‌ల కోసం ఉపయోగించుకుంటాయి. BMW G 310 GS అడ్వెంచర్-టూరర్(tourer) అదే ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంటుంది. (Image Source : Youtube)
అంతేకాకుండా.. TVS Apache RR310 మోడల్ ఆధారంగా కొత్త BMW G 310 RR మోడల్ ను రూపొందించారు. అదనంగా, కొత్త మిడ్-లెవల్ స్పోర్ట్స్ బైక్ RR 310కి సారూప్యతలను కలిగి ఉంటుంది. ఇది కంపెనీకి చెందిన మూడో 310సీసీ మోటార్‌సైకిల్. ప్రస్తుతం G 310 R మరియు G 310 GS అనే రెండు మోడళ్లను విక్రయిస్తున్నారు. మార్కెట్లో వీటికి పెద్ద డిమాండ్ కూడా ఉంది. (Image Source : Youtube)
కంపెనీ విడుదల చేసిన టీజర్ లో కనిపించిన లుక్ Apache RR 310 యొక్క డిజైన్ ఎలిమెంట్లను కాపీ చేశారు. లుక్‌తో పాటు.. బైక్ మెకానిక్‌లు అపాచీ మాదిరిగానే ఉంటాయి. దీనిని RR 310 యొక్క రీబ్యాడ్జ్డ్ వెర్షన్ అని పిలవవచ్చు. ఈ బైక్ ఎరుపు, నీలం మరియు వైలెట్ రంగులను కలిగి ఉంది.(ప్రతీకాత్మక చిత్రం) (Image source: BMW
ఈ మోడల్ వెనుక భాగంలో LED ఉంది. 5.0-అంగుళాల TFT డిస్ప్లేతో కూడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అందించబడుతుంది. ఈ ఇంజన్ 33.5 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లో ఆరు గేర్ లు ఉంటాయి. ఇక ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఆర్ఆర్ 310 అపాచీ ఆర్ఆర్ 310కి సమానమైన ధరను కలిగి ఉండవచ్చని అంచనా. (Image source: BMW