Bitcoin ban in India: ఇండియాలో బిట్‌కాయిన్ పై నిషేధం... అనే మాటను త్వరలో మనం చూస్తాం. నిజమే... ఈ క్రిప్టో కరెన్సీకి చెక్ పెట్టాలని భారత కేంద్ర ప్రభుత్వం బలంగా అనుకుంటోంది. ప్రస్తుతం బిట్ కాయిన్ ధర ఎంతో తెలుసా. ఒక్క కాయిన్ కావాలంటే మనం రూ.24,74,100 చెల్లించాలి. ఇంత రేటు ఉంది కాబట్టి ఇది పూర్తి రక్షణ, సెక్యూరిటీ ఉన్న కరెన్సీ అనుకుందామంటే అలాంటిదేమీ లేదు. ఈ కరెన్సీకి వాల్యూ లేదు. ఏదైనా తేడా వస్తే... ఏ కోర్టుకూ వెళ్లలేం. అందువల్లే ఈ కరెన్సీకి చెక్ పెట్టాలని కేంద్రం డిసైడైనట్లు తెలిసింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌కి సంబంధించిన శాసనపరమైన ఆదేశాన్ని ఇవాళ ఇస్తారు. ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం ఓ బిల్లు ప్రవేశపెట్టబోతోంది. దాని ద్వారా ఇండియాలో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలన్నింటినీ బ్యాన్ చేయబోతోంది. ప్రస్తుతం ఇండియాలో బిట్కాయిన్తోపాటూ... ఇథెర్ (ether), రిపుల్ (ripple) ఇలా చాలా చచ్చాయి. ప్రైవేట్ వాటికి బదులు కేంద్రమే ప్రభుత్వం వైపు నుంచి అధికారిక డిజిటల్ కరెన్సీని తేబోతోంది. అందుకు కూడా బిల్లులో వివరాలు ఉన్నాయి. అంటే త్వరలోనే మనం డిజిటల్ కరెన్సీ చూస్తాం. ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆల్రెడీ ఆ పని చేపట్టిందని తెలిసింది. (ప్రతీకాత్మక చిత్రం)
బిట్‌కాయిన్ విలువ విపరీతంగా పెరిగింది కానీ... నమ్మకం లేనిది అది. అంటే... మనం ఓ 100 అంతస్థుల భవనం నిర్మిస్తే... దాని పునాది ఏడ్చినట్లు ఉంటే... ఆ భవనంలో మనం ఉండగలమా... లేదు కదా... అలాగే ఈ ప్రైవేట్ క్రిప్టో కరెన్సీల విషయంలోనూ జరుగుతోంది. వాటికి ఓ చట్టబద్ధత అన్నది లేదు. వాటి విలువ ఎప్పుడు ఢమాల్ మంటుందో చెప్పలేం. ఏదైనా ఇలాంటిది జరిగితే... ఇండియాలో కొన్ని లక్షల మంది ఈ కాయిన్లు కొన్నవారు రోడ్డున పడతారు. ఆ తర్వాత ప్రభుత్వాలపై మండిపడినా ప్రయోజనం ఉండదు. ఇలాంటి అనర్థాలు జరగకుండా ముందుగానే వాటిని బ్యాన్ చేసేయాలని కేంద్రం ఫిక్స్ అయ్యింది. (ప్రతీకాత్మక చిత్రం)
నిజానికి క్రిప్టోకరెన్సీని కరెన్సీగా భావించవద్దని 2018లో రిజర్వ్ బ్యాంక్ (RBI)... దేశంలోని బ్యాంకుల్ని ఆదేశించింది. ఐతే... 2020 మార్చిలో అందుకు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఈ కరెన్సీ సంగతేంటో తేల్చమని కేంద్రానికి చెప్పింది. దాంతో కేంద్రం ఫోకస్ పెట్టింది. కేంద్రం 2019లోనే దేశంలో క్రిప్టోకరెన్సీని బ్యాన్ చేసే బిల్లు తయారుచేసింది గానీ పార్లమెంటులో పెట్టలేదు. ఇప్పుడు కొత్తగా క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్ 2021 రెడీ అయ్యింది. (ప్రతీకాత్మక చిత్రం)
కేంద్రం తెచ్చే బిల్లు వల్ల భారతీయులకు చాలా మేలు జరగనుంది. RBI ప్రవేశపెట్టే డిజిటల్ కరెన్సీ చాలా తక్కువ రేటే ఉంటుంది. అందువల్ల ప్రజలంతా వాటిపై పెట్టుబడి పెట్టేందుకు వీలవుతుంది. అదే బిట్ కాయిల్ లాంటివైతే... ధనవంతులు మాత్రమే పెట్టుబడి పెట్టగలుగుతున్నారు. కేంద్రం తెచ్చే డిజిటల్ కరెన్సీకి చట్టబద్ధత ఉంటుంది. కాబట్టి ఎవరైనా అన్యాయం జరిగినట్లు భావిస్తే, కోర్టులో తేల్చుకోవచ్చు. ఇలా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇలా బలమైన పునాదితో ప్రభుత్వ డిజిటల్ కరెన్సీ రాబోతోంది. (ప్రతీకాత్మక చిత్రం)