1. ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల యజమాని ఎలాన్ మస్క్ పేరు గతకొన్ని రోజులుగా ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఇటీవల మైక్రో బ్లాగింగ్, సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన మస్క్, తన వినూత్న పనితీరుతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. అయితే ఆయన అలవాట్లు, పద్ధతులతో పాటు లగ్జరీ లైఫ్‌స్టైల్ గురించి చాలామంది మాట్లాడుకుంటారు. ముఖ్యంగా మస్క్‌కు ప్రైవేట్ జెట్ ఎయిర్‌ప్లేన్స్ అంటే ఎంతో పిచ్చి. (image: Gulfstream)
2. ట్రావెలింగ్ కోసం కోట్లాది రూపాయల విలువైన సొంత విమానాలను ఆయన వినియోగిస్తుంటారు. అయితే ఇప్పుడు మస్క్ తాజాగా గల్ఫ్‌స్ట్రీమ్ G700 అనే లగ్జరీ ప్రైవేట్ జెట్ విమానాన్ని ఆర్డర్ చేశారు. విలాసవంతమైన సౌకర్యాలతో వస్తున్న ఈ కొత్త జెట్ ప్లేన్ ధర 78 మిలియన్ డాలర్లు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. మన కరెన్సీలో దీని విలువ రూ. 646 కోట్లు కావడం గమనార్హం. (image: Gulfstream)
3. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరున్న ఎలాన్ మస్క్, ఇప్పుడు టాప్-ఆఫ్-ది-లైన్ గల్ఫ్‌స్ట్రీమ్ G700 జెట్‌ను ఆర్డర్ చేశారు. లేటెస్ట్ G700 జెట్ ప్లేన్‌ను అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ గల్ఫ్‌స్ట్రీమ్ ఏరోస్పేస్ తయారు చేసింది. ఇప్పటి వరకు రూపొందిన అతిపెద్ద జెట్ విమానాలలో ఇది ఒకటిగా నిలుస్తోంది. (image: Gulfstream)
7. ఈ 19-సీటర్ జెట్.. 28x 21 అంగుళాల 20 ఓవల్ విండోస్‌తో వస్తుంది. దీంట్లో రెండు మరుగుదొడ్లు, క్యాబిన్‌తో పాటు నాలుగు లివింగ్ ఏరియాలు ఉంటాయి. వీటిలో ప్రయాణికులు భోజనం చేయడంతో పాటు విశ్రాంతి తీసుకోవచ్చు, పని చేయవచ్చు. గల్ఫ్‌స్ట్రీమ్ G700లో హ్యాపీగా నిద్రపోయేందుకు ఫుల్ సైజ్ లగ్జరీ బెడ్స్ ఉంటాయి. డైనింగ్ సెక్షన్లో మైక్రోవేవ్, ఓవెన్ వంటివి ఉన్నాయి. Wi-Fi సిస్టమ్‌తో ప్లేన్ ఆన్ బోర్డ్ ఎక్స్పీరియన్స్ మరింత బాగుంటుంది. (image: Gulfstream)