1. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజర్లకు షాక్. భారతీయులకు చెందిన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుల డేటా లీక్ అయిందని బయటపడింది. సుమారు 70 లక్షల మంది కార్డ్ హోల్డర్ల డేటా ఆన్లైన్లో ప్రత్యక్షమైందని తేలింది. భారతీయ సైబర్ సెక్యురిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజారియా ఈ విషయాన్ని బయటపెట్టారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. డార్క్ వెబ్‌లోని ఫోరమ్స్ కస్టమర్ల డేటాను సర్క్యులేట్ చేస్తున్నట్టు రాజశేఖర్ గుర్తించారు. ఈ డేటాను సైబర్ నేరాలు, మోసాలు, ఫిషింగ్ దాడులు, ఆన్లైన్ మోసాలకు ఉపయోగించొచ్చు. భారతీయుల క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల డేటా లీక్ అయిందని వాదిస్తున్న రాజశేఖర్ అందుకు సంబంధించిన వివరాలను న్యూస్18తో పంచుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)