Motorola One Fusion+: 20వేల లోపున్న స్మార్ట్ ఫోన్లలో Motorolaకు మంచి పేరుంది. Motorola One Fusion+ స్పెసిఫికేషన్స్ (Review) చాలా బాగున్నాయి. 6.5 ఇంచ్ 1080p డిస్ ప్లే తో ఉన్న ఈ మోడల్ కు HDR10 సర్టిఫికేషన్ కూడా ఉంది. కాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 730G ప్రాసెసర్ కు 6GB RAM, 128GB స్టోరేజ్ సపోర్ట్ ఉంది. వెనక 64MP క్వాడ్-కెమరా సెటప్, 16MP మోటరైజ్డ్ పాప్-అప్ స్లైడర్ కెమరా అదనపు ఆకర్షణ. 5000MAh బ్యాటరీ సామర్థ్యంతో ఉన్న దీనికి టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. గేమ్స్ ఇష్టపడేవారికి ఇది మంచి డివైజ్. ఇక వీడియోలు ఎక్కువ చూసేవారు, ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి ఉన్న వారికి ఈ మోడల్ ఫోన్ చక్కగా సరిపోతుంది. స్టాక్ Android ఎక్స్ పీరియన్స్ తో ఉన్న Motorola One Fusion+ ధరలు Flipkartలో కేవలం రూ.17,499 మాత్రమే.
Nokia 7.2: HMD Global రూపొందిస్తున్న ఈ డివైజుల్లో స్టాక్ ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగిస్తున్నారు. నోకియా ఫోన్లు అందునా Nokia 7.2 మోడల్స్ 2 ఏళ్లపాటు ప్రామిస్డ్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ తో అందుబాటులోకి రావటం హైలైట్. స్పెసిఫికేషన్లను నోకియా పెద్దగా పట్టించుకోకపోయినా 6.3 ఇంచ్ 1080p ప్యూర్ డిస్ ప్లే విత్ వాటర్ డ్రాప్ స్టైల్ తో అదిరిపోయేలా ఉంది. ఆక్టా కోర్ కాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ తో 6GB RAM సపోర్ట్ తో ఇది పనిచేస్తుంది. వచ్చే ఏడాది ఆండ్రాయిడ్ 10, ఆండ్రాయిడ్ 11 కూడా అందుబాటులోకి రానుంది. Nokia 7.2 డివైజ్ కు 3500mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది. Nokia 7.2 ప్రస్తుత ధర రూ.16,999.
Realme 7 Pro: సెప్టెంబర్ లో లాంచ్ అయిన Realme 7 Pro ఇంకా బెస్ట్ స్మార్ట్ ఫోన్ గానే ఊరిస్తోంది. సాంకేతికంగా వీటి రివ్యూలు (Reviews) కూడా చాలా బాగున్నాయి. AMOLED డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 720G ప్రాసెసర్, 4500mAh బ్యాటెరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్, 64MP క్వాడ్-కెమరా సెటప్ వంటి స్పెసిఫికేషన్స్ అదిరేలా ఉన్నాయి. బోలెడన్ని యాప్స్ ను హ్యాండిల్ చేయగల సామర్థ్యం ఉన్న 720G ప్రాసెసర్ ఉన్న ఈ మోడల్ ఫోన్ లో గేమ్స్ కూడా చాలా బాగా ఆడచ్చు. Realme 7 Pro కెమరా చాలా ఇంప్రెస్సివ్ గా ఉంది. నైట్ మోడ్ కూడా చక్కగా పనిచేస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం బ్యాటరీ బ్యాకప్, ఈ ఫీచర్ అద్భుతంగా ఉండటం తోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కారణంగా కేవలం 30 నిమిషాల్లో చార్జ్ చేయవచ్చు. Realme 7 Pro ధరలు కంపెనీ వెబ్ సైట్ ప్రకారం రూ.19,999 మాత్రమే.
Redmi Note 9 Pro Max: Xiaomi's Redmi Note సిరీస్ కొత్తది కాకపోయినప్పటికీ మంచి హార్డ్ వేర్ తో తయారైన బడ్జెట్ డివైజ్ గా పేరుగాంచింది. Redmi Note 9 Pro Max లో ఫీచర్లు కూడా బాగున్నాయి. 6.67 ఇంచ్ 1080p LCD విత్ వాటర్ డ్రాప్-స్టైల్ నాచ్ ఆన్ టాప్ తో భలే క్రేజీగా ఈ ఫోన్ ఉంది. 720G ప్రాసెసర్ ఉండటం వల్ల చాలా యాప్స్ ను హ్యాండిల్ చేయగలదు, గేమర్స్ కు నచ్చేలా దీనికి గేమింగ్ కంపాటబిలిటీ ఉంది. 64MP క్వాడ్-కెమరా సెటప్ ఉన్నందున మంచి ఫొటోలు తీయవచ్చు. అంతేకాదు మైక్రోస్ షూటింగ్ కూడా చేసే సౌలభ్యం ఉండటం విశేషం. 32MP సెల్ఫీ కెమరా తో మోస్ట్ పవర్ ఫుల్ గా ఉంది. మంచి సెల్ఫీలు తీసుకోవాలనుకుంటే ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ కూడా. 5050mAh బ్యాటరీతో పనిచేసే Redmi Note 9 Pro Max డివైజ్ కు 33Wఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. Xiaomi వెబ్ సైట్ ప్రకారం Redmi Note 9 Pro Max ధర కేవలం రూ.16,999 మాత్రమే.