ఐదేళ్ల కాలంలో అదిరే రాబడి అందించిన పలు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ ఐదేళ్ల రాబడి 26 శాతానికి పైగా ఉంది. అంటే ఐదేళ్ల కిందట ఈ ఫండ్లో రూ.లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు రూ. 3.21 లక్షలు వచ్చేవి. అదే నెలకు రూ.10 వేలు సిప్ చేసి ఉంటే రూ. 14 లక్షలకు పైగా లభించేవి.