హోండా, టాటా మోటార్స్ కార్లపై జూన్ నెల డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించాయి. వేరియంట్లను బట్టి హోండా కార్లపై గరిష్టంగా రూ. 27,400, టాటా మోటార్స్ రూ.60 వేల వరకు తగ్గింపును అందిస్తున్నాయి. వీటికి అదనంగా ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ ప్రయోజనాలు, నగదు తగ్గింపు వంటి ఆఫర్లు, ప్రత్యేక రాయితీలను అందిస్తున్నాయి. వివిధ కార్లపై అందిస్తున్న డిస్కౌంట్ల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
న్యూ హోండా అమేజ్ .. 89bhp పవర్ ఫుల్ ఇంజిన్ కలిగిన ఈ న్యూ హోండా అమేజ్... పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభిస్తోంది. ఈ కార్ పై రూ. 5000 తగ్గింపుతో పాటు రూ.5000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.7000 లాయల్టీ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5000 కార్పొరేట్ తగ్గింపుతో కలిపి మొత్తం రూ.27400 వరకు ఆఫర్ పొందవచ్చు. దీని ప్రారంభ ధర రూ.6.56 లక్షలు.
హోండా సిటీ .. ఫోర్త్ జనరేషన్ హోండా సిటీ కారుపై రూ.12,000 తగ్గింపును సంస్థ అందిస్తోంది. ఇందులో రూ. 5,000 లాయల్టీ బోనస్, రూ. 7,000 వేల లాయల్టీ ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ఈ ఆఫర్లు పెట్రోల్ వెర్షన్‌పై మాత్రమే అందిస్తున్నట్ల సంస్థ తెలిపింది. ప్రారంభ ధర రూ.9.94 లక్షలు. 7 స్పీడ్ CVT ట్రాన్స్మిషన్ కలిగిన ఈ కార్... 1.5 లీటర్ i-VTEC ఇంజిన్‌తో లభిస్తుంది. మైలేజీ 10 km/లీటర్. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 4 ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తున్నాయి.