డబ్బు చాలా డేంజరస్. దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే అది ఎంతో మేలు చేస్తుంది. నిర్లక్ష్యంగా వాడితే... రోడ్డున పడేస్తుంది. డబ్బును కంట్రోల్ చెయ్యాలంటే... కావాల్సింది క్రమశిక్షణ. ఆల్రెడీ మనం క్రమశిక్షణతోనే ఉంటాం. కాకపోతే... మనీ పెరిగేందుకు కావాల్సిన క్రమశిక్షణ వేరే ఉంటుంది. అంటే... దీర్ఘకాలం క్రణశిక్షణ కావాలి. ఏళ్లపాటూ... కోటీశ్వరుడు/కోటీశ్వరురాలు కావాలనే పట్టుదల బలంగా ఉండాలి. నిద్రలో, నిద్ర లేచాక కూడా అదే కల మనల్ని వెంటాడుతూ ఉండాలి. అలా కల కంటూనే... ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలి. ఇలా చెయ్యడం వల్ల రోజూ రూ.33 ఆదా చేస్తే... కచ్చితంగా కోటీశ్వరులు అవ్వొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈజీయే.
రూ.33తో ఎలా? : దీర్ఘ కాలం ప్రకారం... ఏడాదికి 12 శాతం రిటర్న్ వస్తుందని అనుకోండి. అప్పుడు మీరు కోటీశ్వరులు అవ్వొచ్చు. మీ వయసు ఇప్పుడు 20 ఏళ్లు అయితే... మీరు రోజూ రూ.33 సేవ్ చేయాలి. అంటే నెలకు రూ.1000 అన్నమాట. 40 ఏళ్ల తర్వాత... మీరు రూ.1.18 కోట్లు (కోటి 18లక్షలు) పొందగలరు. ఈ 40 ఏళ్లలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.4లక్షల 80వేలు.
పెట్టుబడులపై ఓ కన్నేసి ఉంచాలి. మీరు పెట్టుబడి పెడుతున్నాక... ప్రతి ఆరు నెలలకు ఓసారి లేదా... సంవత్సరానికి ఓసారైనా... చెక్ చెయ్యాలి. మీ పెట్టుబడి పెరుగుతుందో లేదో చూసుకోవాలి. అది కంటిన్యూగా పెరుగుతూ ఉండాలి. అలా పెరగట్లేదని మీరు అనుకుంటే, మీకు సంతృప్తిగా లేకపోతే... మీరు... ఆ పెట్టుబడిని వెనక్కి తీసుకొని... మరేదైనా సిప్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.