* ట్యాక్స్ ఎగ్జమ్షన్ ఎత్తివేత : ప్రతి ఒక్కరికి బీమా తప్పనిసరి. విపత్కర పరిస్థితులలో ఈ పాలసీలు ఎంతో అండగా నిలుస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో భిన్న రకాలైన పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కొన్నింటికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రూ.5 లక్షలు అంతకన్నా ఎక్కువ వార్షిక ప్రీమియం ఉన్న పాలసీలకు పన్ను నుంచి మినహాయింపు ఉంది.
* ట్యాక్స్ మినహాయింపు ఆశ చూపి ఎర : నూతన బడ్జెట్ అమలులోకి రావడానికి ఏప్రిల్ 1 వరకు అవకాశం ఉండటంతో ఇన్సూరెన్స్ ఏజెన్సీలు, బ్రోకర్లు, కొన్ని బ్యాంకులు నయా మోసానికి తెరదించుతున్నాయి. మార్చి 31లోగా ప్రజలకు వీలైనన్ని పాలసీలు విక్రయించాలని చూస్తున్నాయి. పన్ను మినహాయింపు ఆశ చూపి వేతన జీవులతో రూ.5 లక్షలు, అంతకన్నా అధిక వార్షిక ప్రీమియం కలిగిన పాలసీలను కొనుగోలు చేయించేలా బలవంత పెడుతున్నాయి.