1. ఫిబ్రవరిలో బ్యాంకులో ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు (Financial Transactions) ప్లాన్ చేస్తున్నారా? అయితే అలర్ట్. ఫిబ్రవరిలో బ్యాంకులకు 7 సెలవులు ఉన్నాయి. వీటిలో సాధారణ సెలవులతో పాటు శివరాత్రి సెలవు కూడా ఉంది. జనవరిలో 5 ఆదివారాలు, సంక్రాంతి, రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు ఎక్కువగా సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఫిబ్రవరిలో 4 ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం, శివరాత్రి సందర్భంగా సెలవులు వచ్చాయి. ఆ రోజుల్లో బ్యాంకులు తెరుచుకోవు కాబట్టి మిగతా రోజుల్లో మీ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలి. మరి ఏఏ తేదీల్లో బ్యాంకులు తెరుచుకోవో, మీ బ్యాంకింగ్ కార్యకలాపాలను ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఫిబ్రవరిలో ఒక లాంగ్ వీకెండ్ కూడా వచ్చింది. ఫిబ్రవరి 18 శనివారం మహాశివరాత్రి. ఫిబ్రవరి 19 ఆదివారం సెలవు. ఫిబ్రవరి 17న శుక్రవారం సెలవు తీసుకుంటే మూడు రోజుల సెలవు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఫిబ్రవరి 18 శివరాత్రి శనివారం రోజు వచ్చింది కాబట్టి, ఫిబ్రవరిలో వరుసగా మూడు శనివారాలు బ్యాంకులు తెరుచుకోవన్న విషయాన్ని ఖాతాదారులు దృష్టిలో పెట్టుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)