1. బ్యాంకు యూనియన్లు మరోసారి సమ్మెకు దిగుతున్నాయి. మార్చి 15, 16 తేదీల్లో సమ్మెను ప్రకటించాయి. రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ సమ్మె చేయబోతున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్-UFBU సమ్మె నిర్వహించబోతున్నట్టు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్-IBA ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. బ్యాంకులు మార్చి 15, 16 తేదీల్లో సమ్మెకు దిగితే వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడతాయి. మార్చి 15 సోమవారం, మార్చి 16 మంగళవారం కాగా అంతకన్నా ముందు మార్చి 13 రెండో శనివారం, మార్చి 14 ఆదివారం ఉన్నాయి. దీంతో మార్చి 13 నుంచి 16 వరకు వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు తెరుచుకోవు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ సమ్మెలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్-AIBEA, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్-AIBOC, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్-NCBE, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్-AIBOA, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-BEFI, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కెనెరా బ్యాంక్ ఎంప్లాయీస్ కాంగ్రెస్-INBEF, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్-INBOC, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్-NOBW, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్-NOBO, ఆల్ ఇండియా నేషనలైజ్డ్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ కెనెరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్-AINBOF ఈ సమ్మెలో పాల్గొంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)