కాగా బ్యాంక్ యూనియన్లు చాలా కాలంగా వేతన సవరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా పెన్షన్ పెంచాలని కోరుకుంటున్నాయి. అంతే కాకుండా ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోందని, సరిపడినంత సిబ్బంది లేదని పేర్కొంటున్నాయి. అందుకే వెంటనే నియమకాలను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. బ్యాంక్ యూనియన్ల సమ్మె టైమ్ కల్లా చర్చలు జరుగుతాయా? లేదా? అనే అంశాన్ని గమనించాల్సి ఉంది. చర్చలు లేకపోతే మాత్రం సమ్మె తప్పదు.