ఇకపోతే ఆదివారం రోజున ఎలాగూ బ్యాంకులు పని చేయవు. అంటే వచ్చే వారంలో మొత్తంగా చూస్తే బ్యాంకులు మూడు రోజులు పని చేయవని చెప్పుకోవాలి. అందువల్ల బ్యాంక్లో పని ఉన్న వారు ఈ బ్యాంక్ హాలిడేస్కు అనుగుణంగా బ్యాంకింగ్ పనులను చక్కబెట్టుకోవచ్చు. ఆర్బీఐ భ్యాంక్ హాలిడే క్యాలెండర్ ప్రకారం బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకోవచ్చు. రాష్ట్రం ప్రాతిపదికన సెలవులు మారుతూ ఉంటాయి.