ఈ వారంలో బ్యాంక్ హాలిడేస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. అక్టోబర్ 24న బ్యాంక్ హాలిడే ఉంది. ఆర్బీఐ లిస్ట్ ఆఫ్ బ్యాంక్ హాలిడేస్ ప్రకారం.. బ్యాంకులు కలి పూజ/దీపావళి/ నరక చతుర్ధశి/ లక్ష్మీ పూజ సందర్భంగా ఈరోజు బ్యాంకులు పని చేయవు. దేశవ్యాప్తంగా ఈ సెలవు ఉంటుంది. అయితే గ్యాంగ్‌టక్, ఇంపాల్‌లో మాత్రం బ్యాంకులు పని చేస్తాయి.
ఒక రాష్ట్రంలో బ్యాంకులు పని చేస్తే.. మరో రాష్ట్రంలో వాటికి హాలిడే ఉండొచ్చు. ఇకపోతే బ్యాంక్ హాలిడేస్‌లో కూడా ఆన్లైన్ సర్వీసులు అందుబాటులోనే ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి వాటి ద్వారా బ్యాంకింగ్ సర్వీసులు పొందొచ్చు. కచ్చితంగా బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటే మాత్రం బ్యాంక్ హాలిడేస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయో చెక్ చేసుకోవడం ఉత్తమం.