BANKS OFFER ADDITIONAL INCENTIVES TO EMPLOYEES BASED ON BANK PERFORMANCE VB
Extra Salary: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి 15 రోజుల అదనపు జీతం.. మీ పేరు ఉందోమో తెలుసుకోండి..
Extra pay: ప్రభుత్వ బ్యాంకుల పనితీరు ఆధారంగా వారి ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. నవంబర్ 2020లో బ్యాంకులు ఉద్యోగుల పనితీరు-అనుసంధాన భాగం కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిలో భాగంగానే పనితీరు మెరుగ్గా ఉంటే అదనపు ప్రయోజనం చేకూరనుంది. పూర్తి వివరాలు ఇలా..
Extra pay: ప్రభుత్వ బ్యాంకుల పనితీరు ఆధారంగా వారి ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. నవంబర్ 2020లో బ్యాంకులు ఉద్యోగుల పనితీరు-అనుసంధాన భాగం కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
దీనిలో భాగంగానే పనితీరు మెరుగ్గా ఉంటే అదనపు ప్రయోజనం చేకూరనుంది. కెనరా బ్యాంక్ ఉద్యోగులు ఉత్తమ పనితీరు కనబర్చినందుకు వారికి ఆ బ్యాంకు 15 రోజుల జీతాన్ని అదనంగా చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
ఆర్థిక లావాదేవీల్లో భాగంగా గత సంవత్సరం నష్టం రాగా 2021లో ఇప్పటికే కెనరా బ్యాంక్ నికర లాభం రూ.2,557 కోట్లు వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
దీంతో ఈ చెల్లింపులు చేసినట్లు తెలిపారు. కెనరా బ్యాంక్ బాటలోనే మరో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగులకు కూడా ప్రోత్సాహకాలు లభించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
ఈ బ్యాంకు లాభం కూడా 150 శాతం కంటే ఎక్కువగా రావడంతో ప్రోత్సాహకాలను కూడా జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఉద్యోగులకు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
ఎస్బీఐ లో 2.5 లక్షల మందికి లాభం పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
బ్యాంకు లాభం 2 శాతం నుంచి 5 శాతం మధ్య వస్తే వారికి 5 రోజుల వేతనం, 10 నుంచి 15 శాతం వస్తే 10 రోజుల వేతనం, 15 శాతం కంటే ఎక్కువ లాభం వస్తే.. ప్రోత్సాహకంగా ఉద్యోగులకు 15 రోజుల వేతనం లభించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
అయితే బ్యాంకు పనితీరు ఆధారంగా ఉద్యోగుల ప్రోత్సాహకాలను అనుసంధానించడాన్ని బ్యాంక్ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 10
ప్రోత్సాహకాలు ఇస్తే అందరికీ ఒకే విధంగా ఉండాలని యూనియన్ సభ్యులు కోరుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)