Bank Timings: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకుల పని దినాలు, పని వేళల్లో మార్పు?
Bank Timings: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకుల పని దినాలు, పని వేళల్లో మార్పు?
Bank News | బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. కొత్త మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. పని వేళలు, పని దినాల్లో మార్పులు రావొచ్చు. దీని వల్ల కస్టమర్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
Bank Working Hours | బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. ఎందుకంటే కొత్త రూల్స్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ పని వేళలు, పని దినాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. అందువల్ల బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి.
2/ 9
దేశంలో బ్యాంకులకు వారానికి ఐదు రోజుల పని వ్యవస్థ అమలులోకి రావొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఈ అంశాన్ని పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఐబీఏ అంగీకారం తెలిపితే.. బ్యాంక్ పని దినాలు, పని వేళలు మారబోతున్నాయి.
3/ 9
బ్యాంక్ యూనియన్ల్ ఇప్పటికే ఐబీఏకు వారానికి ఐదు రోజుల పని వ్యవస్థను అమలు చేయాలని ప్రతిపాదనలు అందించాయి. అంటే వీకెండ్స్‌లో బ్యాంకులు పని చేయవు. ఆదివారం, శనివారం బ్యాంకులకు హాలిడే ఉంటుంది.
4/ 9
అంటే ఐదు రోజుల పని అమలులోకి వస్తే.. ఏడాదిలో బ్యాంక్ హాలిడేస్ కూడా ఎక్కువ అవుతాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీకెండ్స్‌లో బ్యాంక్‌లో పని పూర్తి చేసుకునే వారిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
5/ 9
ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగులకు రెండో శనివారం, నాలుగో శనివారం సెలవు ఉంది. కొత్త ప్రతిపాదన అమలులోకి వస్తే.. ఇక మొదటి శనివారం, మూడో శనివారం కూడా బ్యాంకులు పని చేయవు. అంటే బ్యాంక్ హాలిడేస్ పెరిగిపోతాయి.
6/ 9
అయితే కొత్త ప్రతిపాదన అమలులోకి వస్తే మాత్రం.. బ్యాంక్ ఉద్యోగుల రోజూ వారి పని గంటలు మాత్రం పెరిగిపోతాయి. బ్యాంక్ ఉద్యోగులు కూడా రోజుకు 10 గంటలు పని చేయాల్సి వస్తుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇలా ఉంటుంది.
7/ 9
ఐబీఏ ప్రస్తుతం ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (యూఎఫ్‌బీఈ)తో చర్చలు జరుపుతోంది. అందువల్ల ఈ కొత్త ప్రతిపాదనకు అంగీకారం లభిస్తుందా? లేదా ? అని చెప్పలేం.
8/ 9
వారానికి ఐదు రోజుల పని వ్యవస్థ వల్ల బ్యాంక్ ఉద్యోగులకు బెనిఫిట్ కలగొచ్చు. అయితే బ్యాంక్ కస్టమర్లపై ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. వీకెండ్స్‌లో బ్యాంక్ పనులు పూర్తి చేసుకోవాలని భావించే వారిపై ఎఫెక్ట్ ఉండనుంది.
9/ 9
అయితే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలుపుతుందా? లేదా? అనే అంశం రానున్న కాలంలో వెల్లడి కానుంది. కాగా ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని వ్యవస్థ అమలులో ఉంది. కాగా కొత్తగా వారానికి 4 రోజుల పని వ్యవస్థ కూడా విదేశాల్లో అమలులోకి వస్తోంది.