1. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) ఒక రోజు సమ్మె ప్రకటించాయి. వచ్చేవారం దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ నోటీసు జారీ చేసినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. నవంబర్ 19న తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. అయినా తమ బ్యాంక్ బ్రాంచ్‌లు, కార్యాలయాలు సమ్మెరోజున సజావుగా పనిచేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సమ్మె కార్యరూపం దాలిస్తే కార్యాలయాల పనితీరుపై ప్రభావం ఉంటుందని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. యూనియన్‌లో చురుకుగా ఉన్నందుకు బ్యాంకర్లను లక్ష్యంగా చేస్తున్నారని, ఈ చర్యలకు వ్యతిరేకంగా సభ్యులు సమ్మె చేస్తారని, ఈ మధ్యకాలంలో దాడులు పెరగడమే కాకుండా, అన్ని ఘటనలు ఒకేలా ఉంటున్నాయని, వీటిని తిప్పికొట్టేందుకు సమ్మెకు దిగాలని గత నెలలో AIBEA జనరల్ సెక్రెటరీ సీహెచ్ వెంకటాచలం అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. సోనాలి బ్యాంక్, MUFG బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ మరియు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో AIBEA యూనియన్ లీడర్లను డిస్మిస్ చేశారని, ద్వైపాక్షిక సెటిల్మెంట్, బ్యాంక్-లెవెల్ సెటిల్మెంట్ను ఉల్లంఘిస్తూ 3,300 మంది క్లరికల్ సిబ్బందిని ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్‌కు బదిలీ చేశారని సీహెచ్ వెంకటాచలం అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)