1. బ్యాంకు ఉద్యోగులు జూన్ 27న సమ్మెకు దిగబోతున్నారు. జూన్ 25న నాలుగో శనివారం, జూన్ 26న ఆదివారం సందర్భంగా బ్యాంకులకు వీకెండ్ హాలిడేస్ ఉన్నాయి. దీంతో జూన్ 25, 26, 27 తేదీల్లో బ్యాంకులు తెరుచుకోవు. వరుసగా మూడు రోజులు బ్యాంకులు తెరుచుకోవన్న విషయాన్ని ఖాతాదారులు గుర్తుంచుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2. జూన్ 27న సమ్మెకు దిగుతామని ప్రభుత్వ రంగ బ్యాంకుల యూనియన్ అయిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) చాలా రోజుల క్రితమే ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగుల డిమాండ్‌పై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో చర్చలు జరిగాయి. బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నుంచి హామీ రాకపోవడంతో సమ్మె విషయం ముందుకెళ్లనున్నాయి ఉద్యోగ సంఘాలు. (ప్రతీకాత్మక చిత్రం)
4. బ్యాంకు ఉద్యోగులు పలు డిమాండ్లతో సమ్మెను ప్రకటించాయి. 5 డే వీక్ అమలు చేయాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. వీకెండ్లో రెండు రోజుల సెలవు ఇవ్వాలన్న డిమాండ్ బ్యాంకు ఉద్యోగుల నుంచి చాలాకాలంగా ఉంది. ప్రైవేట్ బ్యాంకులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. బ్యాంకులు తెరుచుకోకపోయినా ఖాతాదారులు ఆన్లైన్లో లావాదేవీలు జరపొచ్చు. యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి. ఖాతాదారులు ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. తప్పకుండా బ్యాంకుకు వెళ్లాల్సిన పని ఉంటే జూన్ 28 వరకు ఆగాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)