వారంలో ఐదు రోజుల పని, పదవీ విరమణ చేసిన బ్యాంక్ ఉద్యోగులకు పెన్షన్ సవరణ, అలాగే అన్ని క్యాడర్లలోనూ సరిపడినంత సిబ్బంది ఉండేలా నియామకాలు చేపట్టడం వంటి పలు డిమాండ్ల నేపథ్యంలో బ్యాంక్ యూనియన్లు సమ్మెకు పిలుపు ఇచ్చాయి. దీంతో బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలువులు వచ్చాయి. నాలుగో శనివారం, ఆదివారం, సోమ వారం, మంగళవారం బ్యాంకులు పని చేసేవి కావు. కానీ ఇప్పుడు బ్యాంక్ స్ట్రైక్ లేకపోవడంతో సోమవారం, మంగళవారం బ్యాంకులు పని చేస్తాయి.
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) అనేది 9 యూనిట్లకు పెద్దగా కొనసాగుతూ వస్తోంది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్రస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక ఆఫీసర్స్ అనేవి ఇవి.