ఇప్పటికే ఎస్బీఐ, పీఎన్బీ వంటి బ్యాంకులు కస్టమర్లకు ఈ కొత్త లాకర్ రూల్స్ గురించి ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తున్నాయి. బ్యాంకులు ఇప్పటికే లాకర్ సదుపాయం ఉపయోగిస్తున్న కస్టమర్లతో లాకర్ అగ్రిమెంట్‌ను రెన్యూవల్ చేసుకోనున్నాయి. కొత్త లాకర్ పాలసీలో భాగంగా లాకర్ అగ్రిమెంట్ పేపర్లు అటు కస్టమర్ల వద్ద, ఇటు బ్యాంక్ వద్ద ఉండున్నాయి. లాకర్ ఫెసిలిటీ తీసుకున్న వారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో ఇందుకు ఉంటాయి.
అలాగే బ్యాంక్‌లో ఎన్ని లాకర్లు ఖాళీగా ఉన్నాయో, ఏ ఏ లాకర్లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయో కూడా కస్టమర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. ఇంకా లాకర్ చార్జీలను బ్యాంకులు ఒకే సారి వసూలు చేయొచ్చు. గరిష్టంగా మూడేళ్ల టెన్యూర్ వరకే ఇది వర్తిస్తుంది. అంటే రూ.1500 చార్జీ అనుకుంటే రూ. 4500 కన్నా ఎక్కువ వసూలు చేయడానికి బ్యాంక్‌కు అధికారం ఉండదు.
ఇంకా లాకర్లలో ఏమైనా మోసాలు జరిగితే.. అప్పుడు బ్యాంకులు సులభంగా తమకు సంబంధం లేదని తప్పుకుంటూ వస్తున్నాయి. అయితే కొత్త రూల్స్ ప్రకారం చూస్తే.. ఇకపై బ్యాంకులు సులభంగా తప్పించుకోవడానికి వీలు ఉండదు. బ్యాంక్ నిర్లక్ష్యం వల్ల లాకర్లో ఐటమ్స్‌కు డ్యామేజ్ జరిగితే.. అప్పుడు బ్యాంకులే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
అగ్ని ప్రమాదం, దొంగతనం వంటివి జరగకుండా సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా బ్యాంక్‌దే. అయితే భూకంపాలు, భారీ వరదలు, సునామీ వంటివి వస్తే.. అప్పుడు లాకర్లో ఐటమ్స్‌కు ఏమైనా జరిగితే అలాంటి సమయంలో బ్యాంకులకు ఎలాంటి సంబంధం ఉండదు. కస్టమర్లకు బ్యాంకులు ఎలాంటి డబ్బులు చెల్లించవు. బ్యాంక్ కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలనే లక్ష్యంగా ఆర్బీఐ లాకర్ రూల్స్‌ను సవరించింది. దీంతో చాలా మందికి ఊరట కలుగుతుంది.