Loan EMI | బ్యాంకులు కస్టమర్లకు భారీగానే వడ్డిస్తున్నాయి. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు పెంపు ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఆర్బీఐ పాలసీ రేటు పెంచడంతో బ్యాంకులు కూడా ఇప్పుడు రుణ రేట్లను పెంచుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే చాలా బ్యాంకులు ఈ పని చేశాయి. ఇప్పుడు మరో బ్యాంక్ కూడా వీటి జాబితాలోకి వచ్చి చేరింది.
ఆర్బీఐ రెపో రేటు పెంచడం వల్ల రుణ రేట్లు కూడా పెరుగుతున్నాయి. దీని వ్లల బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నెలవారీ ఈఎంఐ పైకి కదిలే అవకాశం ఉంటుంది. ఇక కొత్తగా లోన్ తీసుకోవాలని భావిస్తే.. అప్పుడు వీరిపై వడ్డీ భారం పెరుగుతుంది. ఎందుకంటే రుణాలపై వడ్డీ రేట్లు పైకి చేరుతాయి. దీని వల్ల రుణ రేటు పెరిగితే రుణ గ్రహీతలపై ప్రభావం పడుతుంది.