91 రోజుల నుంచి 119 రోజుల ఎఫ్డీలపై వడ్డీ రేటు 4.5 శాతానికి చేరింది. 120 రోజుల నుంచి 180 రోజుల ఎఫ్డీలపై వడ్డీ రేటు 4.75 శాతంగా ఉంది. 181 రోజుల నుంచి 270 రోజుల ఎఫ్డీలపై వడ్డీ రేటు 5.25 శాతంగా కొనసాగుతోంది. 271 రోజుల నుంచి 364 రోజుల ఎఫ్డీలపై వడ్డీ రేటు 5.5 శాతంగా ఉంది. ఏడాది ఎప్డీలపై 6.15 శాతం వడ్డీ పొందొచ్చు.
ఏడాది నుంచి మూడేళ్ల ఎఫ్డీలపై వడ్డీ రేటు 6 శాతంగా ఉంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల ఎఫ్డీలపై అయితే వడ్డీ రేటు 5.75 శాతంగా కొనసాగుతోంది. బ్యాంక్ అలాగే 200 టెన్యూర్‌లోని ఎఫ్డీలపై 7 శఆతం, 400 రోజుల టెన్యూర్‌లోని ఎఫ్డీలపై 6.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇకపోతే సీనియర్ సిటిజన్స్‌కు 0.5 శాతం అధిక వడ్డీ వస్తుంది.
మరోవైపు ఫెడరల్ బ్యాంక్ కూడా ఎఫ్డీ రేట్లను సవరించింది. సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను మార్చింది. ఫెడరల్ బ్యాంక్ ఇప్పుడు సేవింగ్స్ ఖాతాలపై గరిష్టంగా 6.25 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇక ఎఫ్డీ రేట్ల విషయానికి వస్తే.. బ్యాంక్ గరిష్టంగా 7.25 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 18 నెలల నుంచి రెండేళ్ల టెన్యూర్‌లోని ఎఫ్డీలకు ఈ రేటు వర్తిస్తుంది.