Gold Loan Offer: బ్యాంక్ అదిరే ఆఫర్.. కేవలం 62 పైసల వడ్డీకే 10 నిమిషాల్లో గోల్డ్ లోన్, చార్జీలు మాఫీ!
Gold Loan Offer: బ్యాంక్ అదిరే ఆఫర్.. కేవలం 62 పైసల వడ్డీకే 10 నిమిషాల్లో గోల్డ్ లోన్, చార్జీలు మాఫీ!
Bank News | మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ఆఫర్ మీ కోసమే. ఎందుకంటే చౌక వడ్డీ రేటుతో గోల్డ్ లోన్ పొందొచ్చు. అలాగే ప్రాసెసింగ్ చార్జీలు లేవు. వెంటనే లోన్ వస్తుంది.
Gold Loan Interest Rates | మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. తక్కువ వడ్డీకే లోన్ పొందొచ్చు. ఇంకా ప్రాసెసింగ్ ఫీజు మాఫీ లభిస్తోంది. అలాగే వేగంగా లోన్ తీసుకోవచ్చు.
2/ 8
ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర ఈ ఆఫర్ అందుబాటులో ఉంచింది. గోల్డ్ లోన్ తీసుకునే వారు ఈ బ్యాంక్ ద్వారా తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ పొందొచ్చు. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ సొంతం చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లోనే గోల్డ్ లోన్ పొందొచ్చని బ్యాంక్ పేర్కొంటోంది.
3/ 8
కేవలం 7.5 శాతం వడ్డీ రేటుతో గోల్డ్ లోన్ పొందొచ్చు. అటే 62 పైసలు వడ్డీ పడుతుందని చెపుకోవచ్చు. ఒక గ్రాము బంగారానికి గరిష్టంగా రూ. 4 వేల వరకు రుణ మొత్తం పొందొచ్చని బ్యాంక్ తెలియజేస్తోంది. అలాగే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చార్జీలు ఉండవని పేర్కొంటోంది.
4/ 8
బంగారు రుణాలపై తక్షణ రుణ సదుపాయం అందుబాటులో ఉందని బ్యాంక్ పేర్కొంటోంది. వ్యవసార, వ్యక్తిగత అవసరాల కోసం బ్యాంక్ నుంచి గోల్డ్ లోన్ పొందొచ్చని తెలియజేస్తోంది. అలాగే శుద్ధ బంగారంపై అత్యధిక లోన్ సదుపాయం లభిస్తుందని పేర్కొంటోంది. వేగంగా లోన్ లభిస్తుందని తెలియజేస్తోంది.
5/ 8
అంతేకాకుండా బ్యాంక్‌లో అకౌంట్ లోని వారికి బ్యాంక్ ఖాతా తెరిచి 10 నిమిషాల్లోనే గోల్డ్ లోన్ అందిస్తామని బ్యాంక్ పేర్కొంటోంది. అందువల్ల ఎవరైనా గోల్డ్ లోన్ తీసుకోవాలని భావిస్తే.. బ్యాంక్ అందిస్తున్న ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు.
6/ 8
ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం వంటి గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి గోల్డ్ లోన్ తీసుకోవడం కన్నా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి బంగారు రుణాలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే వీటిల్లో తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. దీని వల్ల వడ్డీ భారం తగ్గుతుందని చెప్పుకోవచ్చు.
7/ 8
ఇకపోతే గోల్డ్ లోన్ తీసుకోవాలని భావించే వారు ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఫోటోలు వంటి వాటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యయసాయ రంగం కింద గోల్డ్ లోన్ పొందాలని భావిస్తే.. అప్పుడు పొలం పట్టా జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.
8/ 8
ఇకపోతే యూనియన్ బ్యాంక్‌లో గోల్డ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంగారు రుణాలపై వడ్డీ రేటు 8.45 శాతంగా ఉంది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో చూస్తే.. గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.55 శాతంగా ఉంది.