ఈ ప్లాట్‌ఫారమ్ ఫీజు మాత్రమే కాకుండా ప్రభుత్వం రేట్లు ప్రకారం.. అన్ని రుసుములు, వడ్డీలు, ఇతర ఛార్జీలపై గూడ్స్ & సర్వీస్ ట్యాక్స్‌ను విధిస్తుంది. ఉదాహరణకు బ్యాంక్ కస్టమర్ క్రిడెట్ కార్డ్ ద్వారా రూ.10,500 రెంట్ పే చేస్తే, ఒక శాతం ఛార్జీ ప్రకారం.. ట్రాన్సాక్షన్‌పై రూ.105 ఫీజుగా బ్యాంక్ వసూలు చేయనుంది.
* ఐసీఐసీఐ బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజు ఒక శాతం : ఐసీఐసీఐ బ్యాంక్ కూడా క్రెడిట్ కార్డుల ద్వారా రెంట్ పేమెంట్ చేసే ట్రాన్సాక్షన్లకు కమస్టర్ల నుంచి ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది. ఇది 2022 అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డుతో రెంట్ పేమెంట్ చేసే కస్టమర్లు రూ.99 + GSTని చెల్లించాలి. ఈ నిబంధన 2022 నవంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది.
* నిపుణుల సూచన : రెంట్ పే చెయ్యడం అనేది ప్రతి ఒక్కరి బడ్జెట్లో అతిపెద్ద నెలవారీ ఖర్చు. నగదు నిల్వ కొరతతో చాలా మంది క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి అద్దెను చెల్లిస్తుంటారు. ప్రస్తుతం బ్యాంకులు రెంట్ పేమెంట్‌పై ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. అదే విధంగా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి అద్దెను చెల్లిస్తే.. నిర్ణీత గడువులో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.
ఒకవేళ అలా చేయలేకపోతే భారీ పెనాల్టీలను భరించాలి. ఇది క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి అద్దె చెల్లింపు విషయంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటే, ముందుగా ఇంటి యజమానితో చర్చించి పరిస్థితిని వివరించడం మేలు. అద్దె చెల్లింపును వాయిదా వేయడానికి ఇంటి యజమాని ఒప్పుకుంటే క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించాల్సిన అవసరం ఉండదు.
* ఒక నెల మాత్రమే అవకాశం : అద్దె చెల్లించేందుకు మరో మార్గం లేదన్నప్పడే.. క్రెడిట్ కార్డ్ వినియోగించాలి. అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా రెంట్ పేమెంట్ చేయడం స్వల్పకాలిక ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి మాత్రమే సహాయపడుతుందని అర్థం చేసుకోవాలి. అటువంటి ఉపశమనం ఒక నెల మాత్రమే ఉంటుంది. ఎందుకంటే చివరికి మీరు క్రెడిట్ కార్డ్ బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. EMI సౌకర్యాన్ని ఎంచుకున్నప్పటికీ, క్రెడిట్ కార్డ్ బకాయిలపై వడ్డీ గణనీయంగా ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు.