ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 25 బేసిస్ పాయింట్లు పెరిగింది. 8.3 శాతానికి చేరింది. గత నెలలో ఈ ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్లు పైకి కదిలింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 7.75 శాతం నుంచి 8.05 శాతానికి చేరింది. ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 7.25 శాతం నుంచి 7.5 శాతానికి ఎగసింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.9 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది.
కాగా ఆర్బీఐ మే నెల నుంచి వడ్డీ రేట్లను పెంచుకుంటూనే వస్తోంది. రెపో రేటును పెంచుతూనే ఉంది. డిసెంబర్ నెలలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. రెపో రేటు తాజా పెంపును పరిగణలోకి తీసుకుంటే 6.25 శాతానికి చేరింది. ఆర్బీఐ ఇటీవల రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. కాగా వచ్చే ఆర్బీఐ పాలసీ సమీక్షలో కూడా రెపో రేటు పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.