BANK OF BARODA CUTS INTEREST RATE ON HOME LOAN AND CAR LOAN AHEAD OF FESTIVE SEASON SS
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫెస్టివల్ ఆఫర్... తక్కువ వడ్డీకే హోమ్ లోన్, కార్ లోన్
Bank of Baroda | దసరా, దీపావళి పండుగ సీజన్లో కొత్త కార్ కొనాలనుకుంటున్నారా? కొత్త ఇంట్లో అడుగు పెట్టాలనుకుంటున్నారా? బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) ఫెస్టివల్ ఆఫర్లను ప్రకటించింది. తక్కువ వడ్డీకే హోమ్ లోన్ (Home Loan), కార్ లోన్ (Car Loan) అందిస్తోంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
1. కొత్త కారు కావాలనుకునేవారు ఆఫర్ల కోసం దీపావళి సీజన్ వరకు ఆగుతుంటారు. కొత్త ఇల్లు కొనాలనుకునేవారు కూడా పండుగ సీజన్లో సొంతింటి కల నెరవేర్చుకోవాలని భావిస్తుంటారు. అలాంటివారి కోసం బ్యాంకులు ఈ సీజన్లోనే మంచి మంచి ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటి అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని రీటైల్ లోన్ ఆఫర్స్ ప్రకటించింది. హోమ్ లోన్, కార్ లోన్ ఆఫర్స్‌ను అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లపై 0.25 శాతం తగ్గింపును ప్రకటించింది. బరోడా హోమ్ లోన్, బరోడా కార్ లోన్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీంతో పాటు ప్రాసెసింగ్ ఫీజును కూడా మినహాయించింది బ్యాంక్ ఆఫ్ బరోడా. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. బ్యాంక్ ఆఫ్ బరోడాలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 6.75 శాతం నుంచి, కార్ లోన్ వడ్డీ రేట్లు 7.00 శాతం నుంచి ప్రారంభం అవుతాయి. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు, తక్కువ వడ్డీకే రుణాలు అందించడంతో పాటు కొత్త కస్టమర్లకు మరిన్ని నజరానాలు అందిస్తామని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ బ్యాంకింగ్ bob World లేదా బ్యాంక్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేస్తే రుణాలు వెంటనే మంజూరవుతాయని బ్యాంకు ప్రకటించింది. రుణాల ప్రాసెసింగ్ చాలా వేగంగా జరుగుతుందని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. బ్యాంక్ ఆఫ్ బరోడాలో గరిష్టంగా రూ.10 కోట్ల వరకు హోమ్ లోన్ తీసుకోవచ్చు. సెమీ-అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రూ.1 కోటి వరకు, అర్బన్ ప్రాంతాల్లో రూ.3 కోట్ల వరకు, ఇతర మెట్రో నగరాల్లో రూ.5 కోట్ల వరకు గృహ రుణాలు లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)