1. Bank of Baorda: బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు అలర్ట్. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా. రుణాలు తీసుకునేవారుకు రూ.150 సర్వీస్ ఫీజు చెల్లించాలి. ఇక బ్యాంకుల్లో మూడుసార్లు డబ్బులు డిపాజిట్ చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు. నాలుగోసారి డబ్బులు డిపాజిట్ చేయాలంటే రూ.40 ఛార్జీలు చెల్లించాలి. జన్ ధన్ అకౌంట్ హోల్డర్లకు చార్జీలు ఉండవు. వారికి ఉన్న లిమిట్ కన్నా ఎక్కువ డబ్బులు డ్రా చేస్తే రూ.100 ఛార్జీలు చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2. LPG Gas Cylinder Price: ప్రతీ నెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తుంటాయి. నవంబర్ 1న కమర్షియల్ సిలిండర్ ధరల్ని పెంచాయి ఆయిల్ కంపెనీలు. కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా రూ.265 పెరిగింది. డొమెస్టిక్ సిలిండర్ అంటే సబ్సిడీ సిలిండర్ విషయంలో ఆయిల్ కంపెనీలు ఊరట కల్పించాయి. (ప్రతీకాత్మక చిత్రం)