1. ఏప్రిల్‌లో బ్యాంకులకు అనేక సెలవులు వచ్చాయి. లాంగ్ వీకెండ్స్ (Long Weekends) కూడా వచ్చాయి. సాధారణ సెలవులు, పండుగలు కలిపి ఏప్రిల్‌లో మొత్తం 10 రోజులు బ్యాంకులు తెరుచుకోలేదు. దీంతో కస్టమర్లు లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మేలో బ్యాంకులకు సెలవులు (Bank Holidays) ఎక్కువగా రాలేదు. కేవలం రంజాన్ సందర్భంగా మాత్రమే సెలవు ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రంజాన్ సెలవు కాకుండా సాధారణంగా వచ్చే సెలవులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు 8 రోజులు తెరుచుకోవు. మీరు మేలో ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేస్తున్నట్టైతే ఏఏ రోజుల్లో బ్యాంకులు తెరుచుకోవో తెలుసుకోవడం అవసరం. బ్యాంకుల హాలిడేస్‌ని బట్టి మీ లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ హాలిడేస్ అన్నీ హైదరాబాద్ సర్కిల్లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకులకు మేలో సెలవులు ఉన్న తేదీలు. మేలో ఒక లాంగ్ వీకెండ్ వచ్చింది. మే 3 మంగళవారం నాడు రంజాన్ సందర్భంగా సెలవు. మే 2 సోమవారం సెలవు తీసుకుంటే అంతకన్నా ముందు శనివారం, ఆదివారం సెలవులతో మొత్తం నాలుగు రోజులు లాంగ్ వీకెండ్ ప్లాన్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. మేలో ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుల వివరాలు చూస్తే మే 1న ఆదివారం (దేశమంతా సెలవు), మే 2న రంజాన్ ఈద్ (కొచ్చి, తిరువనంతపురం రీజియన్లలో సెలవు), మే 3న రంజాన్ (దేశమంతా సెలవు), మే 8న ఆదివారం (దేశమంతా సెలవు), మే 9న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి (పశ్చిమ బెంగాల్ రీజియన్), మే 14న రెండో శనివారం (దేశమంతా సెలవు), మే 15న ఆదివారం (దేశమంతా సెలవు) సందర్భంగా సెలవు. (ప్రతీకాత్మక చిత్రం)
6. వీటితో పాటు మే 16న బుద్ధ పూర్ణిమ (త్రిపుర, బేలాపూర్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్), మే 22న ఆదివారం (దేశమంతా సెలవు), మే 28న నాలుగో శనివారం (దేశమంతా సెలవు), మే 29న ఆదివారం (దేశమంతా సెలవు) సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)