1. నిత్యం బ్యాంకుకు వెళ్లి ఆర్థిక లావాదేవీలు (Financial Transactions) జరిపేవారికి అలర్ట్. మార్చిలో బ్యాంకులు 9 రోజులు మూతపడున్నాయి. ఇందులో ప్రతీ నెలా సాధారణంగా వచ్చే సెలవులతో పాటు, పండుగ సెలవులు ఉన్నాయి. హోళీ, ఉగాది, శ్రీరామనవమి సందర్భంగా బ్యాంకులు (Bank Holidays) తెరుచుకోవు. (ప్రతీకాత్మక చిత్రం)
4. మార్చిలో ఈ 9 రోజులు బ్యాంకులు తెరుచుకోవు. ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని తమ లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలి. బ్యాంకులు మూసి ఉన్నప్పుడు ఖాతాదారులు ఆన్లైన్ బ్యాంకింగ్, నెట్‌బ్యాంకింగ్, యూపీఐ, నెఫ్ట్ లాంటి సేవలు వాడుకోవచ్చు. ఈ సేవలన్నీ సెలవులతో సంబంధం లేకుండా 24 గంటలు అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక బ్యాంకులకు సెలవుల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్సైట్ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లో తెలుసుకోవచ్చు. ఈ లింక్‌లో సర్కిల్స్ వారీగా సెలవుల జాబితా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల సెలవుల వివరాల కోసం హైదరాబాద్ సర్కిల్ సెలెక్ట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. మార్చిలో లాంగ్ వీకెండ్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మార్చి 7 మంగళవారం బ్యాంకులకు హోళీ పండుగ సందర్భంగా సెలవు ఉంది. అయితే మార్చి 7న హోళీ పండుగ జరుపుకుంటారా, మార్చి 8న అనే స్పష్టత లేదు. మార్చి 11 రెండో శనివారం, మార్చి 12 ఆదివారం సెలవు. మార్చి 9, 10 సెలవులు తీసుకుంటే 5 రోజుల లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)