1. బ్యాంకు ఖాతాదారులకు ఊరటనిచ్చే విషయం ఇది. బ్యాంకు లావాదేవీలు (Banking Transactions) ప్లాన్ చేసేప్పుడు బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకునేందుకు క్యాలెండర్ తిరగేస్తూ ఉంటారు. పండుగలు, ఇతర సందర్భాల్లో బ్యాంకులకు సెలవులు (Bank Holidays) ఉంటే ఆ రోజుల్లో లావాదేవీలు ప్లాన్ చేసుకోకుండా జాగ్రత్తపడతారు. కానీ జూన్, జూలై నెలల విషయానికి వస్తే కస్టమర్లకు ఈ అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. జూన్లో బ్యాంకులకు సెలవుల వివరాలు చూస్తే జూన్ 5- ఆదివారం, జూన్ 11- రెండో శనివారం, జూన్ 12- ఆదివారం, జూన్ 19- ఆదివారం, జూన్ 25- నాలుగో శనివారం, జూన్ 26- ఆదివారం సందర్భంగా సెలవు. జూలైలో కూడా సాధారణ సెలవులే ఉన్నాయి. జూలై 3- ఆదివారం, జూలై 9- రెండో శనివారం, జూలై 10- ఆదివారం, జూలై 17- ఆదివారం, జూలై 23- నాలుగో శనివారం, జూలై 24- ఆదివారం, జూలై 31- ఆదివారం రోజుల్లో సెలవులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. జూన్లో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు వారాంతపు సెలవులు ఉన్నాయి. జూన్లో బ్యాంకులు మూసి ఉండేది 6 రోజులు మాత్రమే. దాదాపు దేశంలోని అన్ని రీజియన్లలో ఇవే సెలవులు ఉన్నాయి. జూన్ 2న షిమ్లా రీజియన్లో మహారాణ ప్రతాప్ జయంతి సందర్భంగా, జూన్ 15న ఐజ్వాల్, భువనేశ్వర్, జమ్మూ, శ్రీనగర్ రీజియన్లో వైఎంఏ డే, గురు హర్గోబింద్ పుట్టినరోజు, రాజ సంక్రాంతి సందర్భంగా సెలవులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్ ఓపెన్ చేసిన తర్వాత రీజనల్ ఆఫీస్, నెల సెలెక్ట్ చేస్తే సెలవుల వివరాలు తెలుస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బ్యాంకులకు సెలవుల వివరాలు తెలుసుకోవడానికి హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ సెలెక్ట్ చేయాలి. ఏ నెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)