1. తరచూ లావాదేవీల (Banking Transactions) కోసం బ్యాంకులకు వెళ్లేవారికి గమనిక. జూలైలో బ్యాంకులకు ఎలాంటి సెలవులు లేవు. సాధారణ సెలవులు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా బ్యాంకులకు ప్రతీ నెలా పండుగలు, ఇతర సందర్భాల్లో సెలవులు (Bank Holidays) ఉంటాయి. కానీ జూన్, జూలై నెలల్లో బ్యాంకులకు సాధారణ సెలవులే ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. పండుగలు, ఇతర సందర్భాలు ఏవీ లేకపోవడంతో బ్యాంకులకు సెలవులు రాలేదు. కాబట్టి ఖాతాదారులు జూలైలో కూడా బ్యాంకులకు సాధారణ సెలవులు మాత్రమే ఉన్నాయని గమనించాలి. తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్లో మాత్రమే బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఐదు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులు తెరుచుకోవు. మరి ఏఏ రోజుల్లో బ్యాంకులు తెరుచుకోవో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. జూలైలో బ్యాంకులకు సెలవుల వివరాలు చూస్తే జూలై 3- ఆదివారం, జూలై 9- రెండో శనివారం, జూలై 10- ఆదివారం, జూలై 17- ఆదివారం, జూలై 23- నాలుగో శనివారం, జూలై 24- ఆదివారం, జూలై 31- ఆదివారం సందర్భంగా సెలవులు ఉన్నాయి. బ్యాంకులకు జూలైలో మొత్తం 7 సెలవులు వచ్చాయి. ఇవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సెలవుల వివరాలు. (ప్రతీకాత్మక చిత్రం)
4. అయితే దేశవ్యాప్తంగా చూస్తే జూలైలో బ్యాంకులకు 14 సెలవులు వచ్చాయి. జూలై 1న రథయాత్ర, జూలై 7న ఖర్చి పూజ, జూలై 9న ఈద్ ఉల్ అధా, జూలై 11న ఈద్ ఉల్ అఝా, జూలై 13న భాను జయంతి, జూలై 14న బేహ్ దీఖ్లాం, జూలై 16న హరేలా, జూలై 26న కేర్ పూజ సందర్భంగా వేర్వేరు రాష్ట్రాల్లో సెలవులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ సెలవులేవీ తెలుగు రాష్ట్రాలకు వర్తించవు. (ప్రతీకాత్మక చిత్రం)
5. బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్ ఓపెన్ చేసిన తర్వాత రీజనల్ ఆఫీస్, నెల సెలెక్ట్ చేస్తే సెలవుల వివరాలు తెలుస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బ్యాంకులకు సెలవుల వివరాలు తెలుసుకోవడానికి హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ సెలెక్ట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)