బ్యాంక్ సెలవులు అనేవి రాష్ట్రం ప్రాతిపదికన మారతాయి. అందువల్ల సెలవుల్లో మార్పులు ఉండొచ్చు. కొన్ని చోట్ల బ్యాంకులు పని చేస్తే.. మరి కొన్ని చోట్ల హలిడే ఉండే అవకాశం ఉంటుంది. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంక్ హాలిడే ప్రకారం బ్యాంక్ సెలవులు ఎప్పుడు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి వాటి ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. అలాగే బ్యాంక్ యాప్స్ కూడా ఉంటాయి. మొబైల్ ఫోన్ బ్యాంకింగ్ సేవలు కూడా లభిస్తున్నాయి. అందువల్ల మీరు బ్యాంక్ హాలిడేస్‌లో వీటి ద్వారా బ్యాంక్ సేవలు పొందొచ్చు. అలాగే పలు బ్యాంకులు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు కూడా అందిస్తున్నాయి.