ఫిబ్రవరి 20న స్టేట్ డే సందర్భంగా బ్యాంకులు పని చేయవు. అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలో ఈ బ్యాంక్ హాలిడే ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 21న సిక్కిమ్‌లో బ్యాంక్ హాలిడే ఉంటుంది. లోసర్ సందర్బంగా బ్యాంకులకు సెలవు. అదేవిధంగా ఫిబ్రవరి 25న నాలుగో శనివారం వచ్చింది. బ్యాంక్ పని చేయదు. ఫిబ్రవరి 26న ఆదివారం. బ్యాంకులకు హాలిడే.
బ్యాంక్ హాలిడే ఉన్నా కూడా ఆన్లైన్లో బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి వాటి ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. అందువల్ల పెద్దగా బ్యాంక్ కస్టమర్లు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే కచ్చితంగా బ్యాంక్క వెళ్లాల్సి వస్తే మాత్రం ఈ బ్యాంక్ హాలిడేస్‌కు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను సెట్ చేసుకోవడం ఉత్తమం.