Bank Holidays: బ్యాంకు పనులు ఉంటే ఈ రోజే పూర్తి చేసుకోండి.. రేపటి నుంచి 4 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే?
Bank Holidays: బ్యాంకు పనులు ఉంటే ఈ రోజే పూర్తి చేసుకోండి.. రేపటి నుంచి 4 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే?
రేపటి నుంచి వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో మీకు ఎమైనా బ్యాంకులో పని ఉంటే ఈ రోజే పూర్తి చేసుకోవడం బెటర్. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మీకు ముఖ్యమైన బ్యాంకు పనులు ఉన్నాయా? అయితే.. మీకో ముఖ్య గమనిక. రేపటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు పని చేయవు. ఈ నేపథ్యంలో మీ బ్యాంకు పనులను ఈ రోజే పూర్తి చేసుకోండి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
రేపు అంటే ఈ నెల 28వ తేదీన నాలుగో శనివారం, 29న ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణంగా సెలవు ఉంటుంది. తర్వాత బ్యాంక్ ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మెకు వెళ్లనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఐదు రోజుల పని దినాలు, పెన్షన్ అప్టేడ్స్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ రద్దు, వేతన సవరణ డిమాండ్లతో బ్యాంక్ ఉద్యోగులు జనవరి 30, 31 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
దీంతో ఆ రెండు రోజులు బ్యాంకులు పని చేయవు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా ఈ నెల 30-31 తేదీల్లో తమ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
దీంతో రేపటి నుంచి అంటే ఈ నెల 28వ తేదీ నుంచి 31 వరకు మొత్తం 4 రోజులు బ్యాంకులు పని చేయవు. ఈ నేపథ్యంలో మీకు ఏమైనా బ్యాంకులో పని ఉంటే.. ఈ లోగానే పూర్తి చేసుకోవడం బెటర్. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక లింక్ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx సెలవుల వివరాలను తెలుసుకోవచ్చు. ఈ లింక్ ద్వారా మీరు ప్రతి నెలా ప్రతి రాష్ట్రం బ్యాంకు సెలవుల వివరాలను తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)