1. మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? మీ పాన్ కార్డును ఆధార్ నెంబర్కు లింక్ చేశారా? లింక్ చేయకపోతే మీ దగ్గర పాన్ కార్డ్ ఉన్నా వేస్టే. ఆధార్ లింక్ చేయని పాన్ కార్డుల్ని జూన్ 30 వరకే ఉపయోగించగలరు. ఆ తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులన్నీ చెల్లనివే. పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలాకాలంగా కోరుతున్న సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
12. SMS: ఎస్ఎంఎస్ ద్వారా పాన్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ సూచించిన ఫార్మాట్లో ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి 10 డిజిట్ పాన్ నెంబర్ ఎంటర్ చేసి 567678 లేదా 56161 నెంబర్లకు ఎస్ఎంఎస్ పంపాలి. ఉదాహరణకు మీ ఆధార్ నెంబర్ 123456789876, మీ పాన్ నెంబర్ BBBBB1111H అనుకుందాం. UIDPAN 123456789876 BBBBB1111H అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి. (ప్రతీకాత్మక చిత్రం)
13. Online: ఆన్లైన్లో పాన్, ఆధార్ లింక్ చేయడానికి https://www.incometax.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Link Aadhaar ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. Link Aadhaar పైన క్లిక్ చేస్తే పాన్, ఆధార్ నెంబర్లు లింక్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)