Bank Account: తెల్లారేసరికి ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అకౌంట్లో 3.7 లక్షల కోట్ల రూపాయలు... ఆ తర్వాత ఏం జరిగిందంటే
Bank Account: తెల్లారేసరికి ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అకౌంట్లో 3.7 లక్షల కోట్ల రూపాయలు... ఆ తర్వాత ఏం జరిగిందంటే
Bank Account | బ్యాంక్ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయితే ముందుగా ఆ డబ్బులు పంపింది ఎవరో చెక్ చేస్తాం. ఎవరివో తెలియకుండా డబ్బులు వస్తే షాక్ అవ్వాల్సిందే. ఇలాగే ఓ వ్యక్తి అకౌంట్లోకి ఏకంగా రూ.3.7 లక్షల కోట్లు వచ్చాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోండి.
1. అమెరికాలోని లూసియానాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన డ్యారెన్ జేమ్స్ బ్యాంక్ అకౌంట్లో ఏకంగా 50 బిలియన్ డాలర్లు డిపాజిట్ అయ్యాయి. 50 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.3.7 లక్షల కోట్లు. అంటే 3718675000000 రూపాయలు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. ఎప్పట్లాగే అతని భార్య అకౌంట్ చెక్ చేస్తే ఏకంగా 50 బిలియన్ డాలర్ల బ్యాలెన్స్ కనిపించేసరికి షాక్ అయింది. ఇది కలా, నిజమా అనుకొని మళ్లీ చెక్ చేసింది. తన భర్త అకౌంట్లో భారీగా డబ్బుల్ని చూసి షాక్ అయింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. వెంటనే తన భర్తకు కాల్ చేసి బ్యాంక్ అకౌంట్లో 50 బిలియన్ డాలర్లు డిపాజిట్ అయ్యాయని చెప్పింది. అతనూ షాక్ అయ్యాడు. షాక్ నుంచి తేరుకున్నాక అంత డబ్బు ఎక్కడిదా అని ఆలోచించాడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని అనుకున్నాడు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. ఏం జరిగిందా అని తెలుసుకునేందుకు బ్యాంకుకు కాల్ చేశాడు డ్యారెన్ జేమ్స్. తన అకౌంట్లో భారీ మొత్తంలో డబ్బులు డిపాజిట్ అయ్యాయని చెప్పాడు. ఆ డబ్బులు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని ప్రశ్నించాడు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. అయితే పొరపాటున ఆ డబ్బు డిపాజిట్ చేసినట్టు తేల్చింది బ్యాంకు. కానీ అంత భారీ మొత్తంలో డబ్బు ఎవరిదో మాత్రం బ్యాంకు వెల్లడించలేదు. కొన్ని రోజుల్లోనే బ్యాంకు ఆ డబ్బును వెనక్కి తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. తన అకౌంట్లో అన్ని సున్నాలు చూసి డ్యారెన్ జేమ్స్ సంబరపడ్డాడు. కొన్ని రోజులైనా 3.7 లక్షల కోట్లు అకౌంట్లో ఉన్నందుకు మురిసిపోయాడు. ఆ డిపాజిట్‌కు సంబంధించిన వివరాలను ఫోటో తీసుకొని దాచుకున్నాడు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. ఒకవేళ ఆ డబ్బు మొత్తాన్ని తనకే ఇచ్చి ఉంటే సేవా కార్యక్రమాలు చేసేవాడినని డ్యారెన్ జేమ్స్ తెలిపాడు. చిన్నపిల్లల కోసం ఆస్పత్రిని కూడా నిర్మించేవాడినని అన్నాడు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. బ్యాంకులో పొరపాటు వల్ల ఇలా ఒకరి అకౌంట్లో జమ కావాల్సిన డబ్బు మరొకరి అకౌంట్లో డిపాజిట్ కావడం మామూలే. అలాంటి సందర్భాల్లో ఆ కస్టమర్‌ను సంప్రదించి బ్యాంకు డబ్బు వెనక్కి తీసుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఆ డబ్బు ఖర్చు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)