15 నెలల స్పెషల్ ఎఫ్డీలపై 6.95 శాతం వడ్డీ పొందొచ్చు. 18 నెలల స్పెషల్ ఎఫ్డీలపై 7 శాతం, 22 నెలల స్పెషల్ ఎఫ్డీలపై 7.1 శాతం, 30 నెలల స్పెషల్ ఎఫ్డీపై 7.3 శాతం, 33 నెలల స్పెషల్ ఎఫ్డీపై 7.3 శాతం, 39 నెలల స్పెషల్ ఎఫ్డీపై 7.6 శాతం, 44 నెలల స్పెషల్ ఎఫ్డీపై 7.7 శాతం వడ్డీని అందిస్తోంది. రూ. 5 కోట్ల వరకు డిపాజిట్లకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది.
అలాగే 15 నెలల స్పెషల్ ఎఫ్డీపై 7.2 శాతం, 18 నెలల స్పెషల్ ఎఫ్డీపై 7.25 శాతం, 30 నెలల స్పెషల్ ఎఫ్డీపై 7.55 శాతం, 33 నెలల స్పెషల్ ఎఫ్డీపై 7.55 శాతం, 39 నెలల స్పెషల్ ఎఫ్డీపై 7.85 శాతం, 44 నెలల స్పెషల్ ఎఫ్డీపై 7.95 శాతం వడ్డీ వస్తుంది. అందువల్ల ఎవరైనా డబ్బులు దాచుకోవాలని భావిస్తే.. ఈ కొత్త ఎఫ్డీ స్కీమ్‌ను పరిశీలించొచ్చు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపు ప్రయోజనం కూడా పొందొచ్చు.