Bajaj e-Chetak: రేపే బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ రిలీజ్... కుర్రాళ్ల కోసం స్పెషల్ ఫీచర్స్

Bajaj e-Chetak | బజాజ్ చెతక్... ఈ పేరు వింటే 1980, 90 దశకాల్లో టూవీలర్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన స్కూటర్ కళ్లముందు కనిపిస్తుంది. ఇప్పటికీ పాత స్కూటర్లు రోడ్లపై కనిపిస్తూ ఉంటాయి. బజాజ్ చెతక్ గురించి ఈ తరానికి తెలిసింది తక్కువే. అయితే ఈ తరం కుర్రాళ్లను ఆకట్టుకునేందుకు బజాజ్ చెతక్ కొత్త రంగులు, కొత్త హంగులతో వస్తోంది. 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్' విశేషాలు తెలుసుకోండి.