1. భారతదేశంలో టూవీలర్ తయారీ కంపెనీల్లో ఒకటైన బజాజ్ ఆటో (Bajaj Auto) చీపెస్ట్, పాపులర్ బైక్ అయిన సీటీ100 (Bajaj CT100) మోడల్‌ను ఆపేసింది. బజాజ్ ఆటో అందించిన బైక్స్‌లో ఈ బైక్ చాలా తక్కువ ధరకే లభించేది. ఈ బైక్ చాలా పాపులర్ అయింది. మొదటిసారి టూవీలర్ కొనాలనుకునేవారు బజాజ్ సీటీ100 కొనేందుకు ఆసక్తి చూపించేవారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. కొన్నాళ్ల క్రితం బజాజ్ ఆటో బజాజ్ సీటీ100 బైక్ అప్‌గ్రేడ్ మోడల్‌ను లాంఛ్ చేసింది. లేటెస్ట్ ఫీచర్స్, కొత్త కలర్స్‌తో కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. ప్రస్తుతం బజాజ్ సీటీ110ఎక్స్ మోడల్ అందుబాటులో ఉంది. దీంతో పాపులర్ బైక్ అయిన బజాజ్ సీటీ100 మోడల్ తయారీని పూర్తిగా నిలిపివేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ప్రస్తుతం బజాజ్ సీటీ100 కొత్త బైక్ షోరూమ్‌లల్లో దొరకడం దాదాపు కష్టమే. డీలర్ల దగ్గర బుకింగ్స్‌ని నిలిపివేసింది. బజాజ్ ఆటో వెబ్సైట్లో కూడా బజాజ్ సీటీ100 లిస్టింగ్‌ను తీసేసింది. వీటి తయారీని కూడా నిలిపివేసింది బజాజ్ ఆటో. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఈ బైక్‌కి డిమాండ్ ఎక్కువగానే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. హీరో స్ప్లెండర్ బైక్‌కి గట్టి పోటీ ఇచ్చిన బైక్ బజాజ్ సీటీ100. బైక్ సెగ్మంట్లో బాగా పాపులర్ అయిన మోడల్ కూడా. అయితే ఈ బైక్‌ని నిలిపివేస్తున్నట్టుగా కంపెనీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. మరి లేటెస్ట్ డిజైన్‌తో, ఫీచర్స్‌తో బజాజ్ సీటీ100 మళ్లీ మార్కెట్లోకి వస్తుందా అన్న చర్చ జరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. బజాజ్ సీటీ100 లాంఛ్ అయినప్పటి నుంచి తక్కువ ధరకే మార్కెట్లో అందుబాటులో ఉండేది. వీకీపీడియాలోని సమాచారం ప్రకారం బజాజ్ సీటీ100 మొదటి జనరేషన్ 2004 నుంచి 2006 వరకు, రెండో జనరేషన్ 2015 నంచి 2019 వరకు, మూడో జనరేషన్ 2020 నుంచి అందుబాటులో ఉంది. బీఎస్4 వేరియంట్ 2017లో, బీఎస్6 వేరియంట్ 2020లో, బజాజ్ సీటీ110ఎక్స్ 2021లో లాంఛైంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. బజాజ్ సీటీ110 ఎక్స్ డిజైన్ బజాజ్ సీటీ100 లాగానే ఉంటుంది. బజాజ్ సీటీ110 స్పెసిఫికేషన్స్ చూస్తే 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇంజిన్ కెపాసిటీ 115.45సీసీ. ఎలక్ట్రిక్ స్టార్ట్ ఫీచర్ ఉంది. గంటకు 90 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లొచ్చు. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్లు. (image: Bajaj Auto)