Gold Sliver Rate Today:బంగారం ధరలు మళ్లీ పైపైకి ఎగబాకుతున్నాయి. నిన్న నేల చూపులు చూసిన బంగారం ధర.. నేడు ఎగబాకింది. ఒక రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్న్యూసే. మరోసారి బంగారం రేట్లు పెరిగాయి. మరోవైపు వెండి కూడా పసిడి బాటలోనే నడిచింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం ధర మరోమారు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 380 రూపాయలు పెరిగింది. దీంతో బంగారం ధర ప్రస్తుతం 47,840కి చేరింది. అయితే దేశంలో బంగారం ధరల్లో ఎన్ని మార్పులు వచ్చినా.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. అందుకే రేట్లు తరచూ పెరుగుతూ వస్తున్నాయి.
దేశంలో మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. తాజాగా గురువారం 10 గ్రాముల బంగారం, వెండి ధరపై స్వల్పంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ధరలు పెరుగుదలతో పసిడి ప్రేమికులు షాక్ తింటున్నారు. ఇక దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,460 ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,460 ఉంది.
కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 ఉంది.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,130 ఉంది.
దీపావళి తర్వాత రూ.60 వేల వరకు..
ప్రస్తుతం మార్కెట్లో ఈ పెరుగుదల చూస్తే.. భవిష్యత్తుల్లో మరింత హెచ్చరిక తప్పదు అంటున్నారు నిపుణులు.. ప్రస్తుతం స్వల్పంగా పెరుగుతున్న పసిడి ధరలు.. దీపావళి పండగ తర్వాత 60 వేల వరకు చేరుకునే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా చాలామంది బంగారాన్ని కొనే పరిస్థితి లేదు. అయితే దీపావళి తరువాత బంగారం మార్కెట్ పుంజుకుంటుందని ఆశిస్తున్నారు.
ధరల పెరుగుదలకు కారణాలు ఏమిటి..?
బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.
బంగారం బాటలోనే వెండి..
బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండిపై స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి 60,450 ఉండగా, చెన్నైలో 64,800 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.60,45 ఉండగా, కోల్కతాలో రూ.60,450 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.60,450 ఉండగా, కేరళలో రూ.64,800 ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.64,800 ఉండగా, విజయవాడలో రూ. 64,800 వద్ద కొనసాగుతోంది.