భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్(Axis Bank) తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్(MCLR- Marginal Cost Of Lending Rate )ను పెంచింది. ఈ మేరకు మే 18, బుధవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులు హోమ్ లోన్, కార్ లోన్లు తీసుకొన్న వారిపై ప్రభావం కనిపించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఎంసీఎల్ఆర్ అనేది రుణదాతలు లోన్ ఇచ్చేందుకు నిర్దేశించుకున్న దిగువ బెంచ్మార్క్ రేటు. అంతకంటే తక్కవ వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇవ్వకూడదు. అయితే ఎంసీఎల్ఆర్ 35 బేసిస్ పాయింట్లు పెంచినట్లు యాక్సిస్ బ్యాంక్ తన నోటిఫికేషన్లో తెలిపింది. కొత్త రేట్లు మే 18 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. యాక్సిస్ బ్యాంక్ MCLR పెంపుతో రుణ వడ్డీలు పెరుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
మే 18 నుంచి అమలులోకి వచ్చే యాక్సిస్ బ్యాంక్ MCLR వివరాలు.. MCLR రేట్ల తాజా పెరుగుదలతో యాక్సిస్ బ్యాంక్ ఓవర్నైట్, ఒక నెల MCLR రేటు ఇప్పుడు 7.55 శాతంగా ఉంది. అంతకు ముందు ఇది 7.20 శాతంగా ఉంది. మూడు నెలలకు ఎంసీఎల్ఆర్ను 7.30 శాతం నుంచి 7.65 శాతానికి పెంచగా, ఆరు నెలలకు యాక్సిస్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటును 7.35 శాతం నుంచి 7.70 శాతానికి తీసుకువెళ్లింది. (ప్రతీకాత్మక చిత్రం)