చాలా మంది స్థిరమైన, నష్ట భయం లేని రాబడి కోసం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తారు. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలతో.. బ్యాంకులలో కొన్ని వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ క్రమంలోనే ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించేందుకు ప్రధాన బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీని పెంచుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
తాజాగా ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ పెద్ద మొత్తంలో చేసే ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి గల వివిధ ఎఫ్డీలపై 4.65 శాతం నుంచి 6.30 శాతం మధ్య వడ్డీ రేట్‌ను ఆఫర్ చేస్తోంది. నూతన ఎఫ్డీ రేట్లు ఎలా ఉన్నాయో? ఇప్పుడు చూద్దాం.. (ప్రతీకాత్మక చిత్రం)
* రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లు
7 రోజుల నుంచి 14 రోజుల టెన్యూర్‌కి చేసిన ఎఫ్డీలపై యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుతం 4.65 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. 15 రోజుల నుంచి 45 రోజుల కాలానికి చేసిన డిపాజిట్లపై 5.00 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 46 రోజుల నుంచి 6 నెలల కాల వ్యవధికి చేసిన ఎఫ్డీలపై 6.00 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
అదే విధంగా 6 నెలల నుంచి 9 నెలల కాలపరిమితి ఎఫ్డీలపై 6.35 శాతం, 9 నెలల నుంచి 1 సంవత్సరం కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.40 శాతం వడ్డీని వినియోగదారులు అందుకోవచ్చు. ఒక సంవత్సరం నుంచి 13 నెలలలోపు కాలపరిమితి ఎఫ్డీలపై 7.00 శాతం, 13 నెలల నుంచి 3 సంవత్సరాల కాలవ్యవధికి 6.80 శాతం, 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధికి 6.30 శాతం వడ్డీని బ్యాంకు అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)