యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) అకౌంట్ హోల్డర్స్‌కు అలర్ట్. తాజాగా యాక్సిస్ బ్యాంక్ అనేక రకాల సేవింగ్ అకౌంట్ల మినిమమ్ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్స్ (Minimum Balance Requirements) పెంచేసింది. అలాగే మంత్లీ క్యాష్ ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ (Monthly Cash Free Transaction)ను రూ.2 లక్షల నుంచి రూ.1.5 లక్షలకు తగ్గించింది. ఈ మార్పులు ఏప్రిల్ 1, 2022 నుంచి యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులందరికీ వర్తిస్తాయి.(ప్రతీకాత్మక చిత్రం)
మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఈజీ సేవింగ్స్, ఇలాంటి ఇతర ప్రోగ్రామ్‌ల కోసం మినిమమ్ బ్యాలెన్స్ ని రూ.10,000 నుంచి రూ.12,000కి పెంచింది యాక్సిస్ బ్యాంక్. మంత్లీ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ లేదా మినిమమ్ అమౌంట్ లో కొత్తగా తీసుకొచ్చిన మార్పు అనేది యావరేజ్ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ రూ.10,000 ఉన్న ప్లాన్లకు మాత్రమే వర్తిస్తుందని యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు గమనించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు తమ బ్యాంక్ ఖాతాలో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ లేదా మినిమమ్ మంత్లీ బ్యాలెన్స్‌ను తప్పనిసరిగా మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్యాలెన్స్ మెయింటెన్ చేయని పక్షంలో చాలా బ్యాంకులు పెనాల్టీ ఛార్జీని విధిస్తాయి. ఈ బ్యాలెన్స్ అనేది రకరకాల కారణాల వల్ల మారుతూ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇది కొన్నిసార్లు ఖాతాదారుని లొకేషన్, అకౌంట్ కేటగిరిపై ఆధారపడి ఉంటుంది. "మెట్రో/అర్బన్ లొకేషన్లలో ఈజీ సేవింగ్స్ (Easy Savings), దానికి సమానమైన పథకాల కోసం యావరేజ్ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ థ్రెషోల్డ్ రూ.10,000 నుంచి రూ.12,000కి రివైజ్డ్ చేయడం జరిగింది." అని యాక్సిస్ బ్యాంక్ తన వెబ్సైట్ లో పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
మంత్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్
ఈజీ సేవింగ్స్, ఇలాంటి ఖాతాల కోసం మంత్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఫ్రీ లిమిట్స్ రూ. 2 లక్షల నుంచి రూ. 1.5 లక్షలకు తగ్గించారు. ఇంతకుముందు, మంత్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్ మొదటి నాలుగు లావాదేవీలకు లేదా రూ. 2 లక్షలకు వర్తించేది. ఇప్పుడు, మంత్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఫ్రీ లిమిట్ మొదటి నాలుగు లావాదేవీలు లేదా రూ.1.5 లక్షలకు వర్తిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)