1. మొబైల్ బ్యాంకింగ్ చేసేవారికి బ్యాంకులు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూనే ఉంటాయి. అయితే చాలామంది వాటిని పెద్దగా పట్టించుకోరు. ఆ తర్వాత ఇబ్బందుల్లో పడతారు. మీరు మీ స్మార్ట్‌ఫోన్ నుంచి తరచూ లావాదేవీలు చేస్తే మీ హ్యాండ్‌సెట్‌కు పిన్, పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. లేదనుకుంటే కనీసం మొబైల్ యాప్స్కైనా పిన్, పాస్వర్డ్ ఉండాలి. లావాదేవీలు జరిపినప్పుడు అలర్ట్స్ వచ్చేందుకు మీ మొబైల్ నెంబర్, ఇ-మెయిల్ ఐడీ బ్యాంకులో రిజిస్టర్ చేసుకోవాలి.
2. బ్యాంకు నుంచి పంపినట్టుగా ఏవైనా ఎస్ఎంఎస్, ఇ-మెయిల్స్ వస్తే నమ్మేయొద్దు. మీకు ఏదైనా అనుమానం వస్తే అందులో ఉన్న యూఆర్ఎల్ క్లిక్ చేయకూడదు.
3. మీ మొబైల్ రిపేర్ కోసం సర్వీస్ సెంటర్లో ఇచ్చేప్పుడు బ్రౌజింగ్ హిస్టరీ, టెంపరరీ ఫైల్స్ క్లియర్ చేయాలి. అవసరమైతే మీ బ్యాంక్ యాప్స్ డిలిట్ చేసివ్వాలి. తర్వాత మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
8. మీ డివైజ్‌లో లొకేషన్ ట్రాకింగ్, రిమోట్ వైప్, ఎన్క్రిప్షన్ లాంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఎనేబుల్ చేసుకోవాలి. మీ స్మార్ట్‌ఫోన్ పోయినా, ఎవరైనా దొంగిలించినా వెంటనే డేటా డిలిట్ చేయొచ్చు.
9. మీ స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే మొబైల్ బ్యాంకింగ్ చేయడం మంచిది. మొబైల్ బ్యాంకింగ్ కోసం ఇతరు ఫోన్లు ఉపయోగించొద్దు.