1. ఏటీఎంలో మీరు ఉపయోగించే సేవలకు చెల్లించాల్సిన ఛార్జీలు కూడా మారబోతున్నాయి. త్వరలోనే కొత్త రూల్స్, కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఇటీవల ఏటీఎం లావాదేవీల విషయంలో కొత్త రూల్స్‌ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో కస్టమర్లు ప్రధానంగా 4 కొత్త రూల్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ATM Cash Withdraw Limit: మీకు అకౌంట్ ఉన్న బ్యాంక్ ఏటీఎంలో ఐదు ఉచిత లావాదేవీలు జరపొచ్చు. ఇందులోనే ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. అంటే డబ్బులు డ్రా చేస్తే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కిందకు వస్తుంది. నగదుతో సంబంధంలేని లావాదేవీలు నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కిందకు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)