ఇకపోతే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఓలా ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ కంపెనీ అమ్మకాలు దుమ్ము రేపుతున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ మూడు మోడళ్లను అందిస్తోంది. ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్, ఓలా ఎస్1 ప్రో అనేవి ఇవి. వీటి ధర రూ. 84,999 నుంచి ప్రారంభం అవుతోంది. టాప్ వేరియంట్ ధర రూ.1.5 లక్షల దాకా ఉంది. ఇకపోతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ 180 కిలోమీటర్ల వరకు ఉంది. ప్రస్తుతం ఎక్కువ మంది కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం గమనార్హం.