కస్టమర్లు అప్‌గ్రేడ్ లేదా కొత్త స్మార్ట్, ఫాస్టర్ ఏథర్ 450 ఎక్స్ స్కూటర్‌ను ఈజీ ఫైనాన్స్ ఆప్షన్‌తో కొనుగోలు చేయొచ్చు. కస్టమర్లకు ఆకర్షణీయ ఈఎంఐ ఆప్షన్లు ఉంటాయి. అందువల్ల పెట్రోల్ స్కూటర్ కొనాలని భావించే వారు వారి నిర్ణయాన్ని మరోసారి పునర్ సమీక్షించుకోవచ్చు. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిశీలించొచ్చు.
ఇంకా జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. పాత స్కూటర్ లేదా మోటార్ సైకిల్ ఇచ్చి జీరో డౌన్ పేమెంట్ కింద కొత్త ఏథర్ స్కూటర్ కొనొచ్చు. ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ ఎస్ ఫోకేలా మాట్లాడుతూ.. కొత్త ఫైనాన్స్ స్కీమ్స్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగంలో గణనీయమైన పెరుగుదల నమోదు అవుతుందని తెలిపారు.